BRS : ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ

బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు.

Update: 2025-09-03 06:34 GMT

బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమై పలు రాజకీయ అంశాలను చర్చిస్తున్నారు. కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తర్వాత జరిగే పరిణామాలు, ఒకవేళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేస్తే ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ తో కేటీఆర్ చర్చిస్తున్నట్లు తెలిసింది.

కవిత విమర్శలు చేస్తే...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీపదవి కావడంతో కవిత రాజీనామా తర్వాత ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కూడా కేసీఆర్ తో ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఈరోజు కవిత మీడియా సమావేశంలో పార్టీ నేతలపై విమర్శలు చేస్తే ఏం చేయాలన్న దానిపై కూడా కేసీఆర్ నుంచి కొన్ని సలహాలు కేటీఆర్ తీసుకుంటున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News