పాపి కొండల్లో వైల్డ్ డాగ్స్.. వాటి సత్తా తెలుసా?
పాపికొండల అభయారణ్యంలో అడవి కుక్కలు బాగా సంచరిస్తున్నాయి.
పాపికొండల అభయారణ్యంలో అడవి కుక్కలు బాగా సంచరిస్తున్నాయి. ఇవి అనేక జంతువులను వేటాడుతుంటాయి. పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవట. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్‌డాగ్స్ వాటి కంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. ఇవి ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాయి. పాపికొండలు, నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉందని తెలిపారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్న నేపద్యంలో ఇవి స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.