ఒక్క చేప 22.5 కిలోలు.. దశ తిరిగింది

నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయంలో భారీ చేపలు వలలకు చిక్కుతూ ఉన్నాయి.

Update: 2025-06-30 13:15 GMT

నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయంలో భారీ చేపలు వలలకు చిక్కుతూ ఉన్నాయి.పెద్దూరుకు చెందిన జి.ముత్యాలు వలకు ఏకంగా 22.5 కిలోల బరువైన బొచ్చె రకం చేప చిక్కింది. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. గతంలో 18 కిలోల చేప పడగా.. ఇప్పుడు ఈ చేప ఆ రికార్డును బద్దలు కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఒకే ఒక్క చేప ద్వారా వేల రూపాయల ఆదాయం మత్య్సకారులకు లభిస్తూ ఉన్నాయి. జలాశయాల్లో చేపల సంపద పెరగడం, స్థానిక మత్స్య పరిశ్రమ వృద్ధి చెందడంతో ఎన్నో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలుతున్నాయి.

Tags:    

Similar News