హమ్మయ్య... ఆమెకు ఒమిక్రాన్ లేదు

తెలంగాణకు ఒమిక్రాన్ టెన్షన్ ప్రస్తుతానికి తప్పింది. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ లేదని తేలింది

Update: 2021-12-06 07:48 GMT

తెలంగాణకు ఒమిక్రాన్ టెన్షన్ ప్రస్తుతానికి తప్పింది. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ అన్న అనుమానం ఉంది. అందుకే ఆమె రక్తనమూనాలను జినోమ్ స్వీక్వెన్స్ కోసం పంపారు. అయితే ఆమెకు కరోనా పాజిటివ్ కాని ఒమిక్రాన్ వేరియంట్ కాదని తేలింది. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వెయ్యిమందికి....
తెలంగాణకు దాదాపు వెయ్యి మంది ఇటీవల కాలంలో విదేశాల నుంచి వచ్చారు. వారికి పరీక్షలు నిర్వహించి కొందరిని ఐసొలేషన్ కు పంపారు. కానీ బ్రిటన్ నుంచి వచ్చిన 35 ఏళ్ల మహిళ విషయంలోనే అధికారులు కంగారు పడ్డారు. ఆమెకు ఒమిక్రాన్ వేరియంట్ వచ్చి ఉండవచ్చన్న సందేహపడ్డారు. కానీ లేదని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు.


Tags:    

Similar News