ఒమిక్రాన్ అలజడి.. రాజధానిలో రెడ్ అలర్ట్ !

కరోనా కొత్త వేరియంట్ గా కనుగొనబడిన ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచాన్నంతటినీ గడగడలాడిస్తోంది.

Update: 2021-12-03 04:53 GMT

కరోనా కొత్త వేరియంట్ గా కనుగొనబడిన ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచాన్నంతటినీ గడగడలాడిస్తోంది. ఇది డెల్టా వేరియంట్ కన్నా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమై.. ప్రయాణికుల రాకపోకలపై దృష్టి సారించాయి. ఇండియా విషయానికొస్తే బ్రిటన్ దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది ఆచూకీ మిస్సైనట్లు ప్రభుత్వం పేర్కొంది.

బ్రిటన్ నుంచి ...
తాజాగా బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భాగ్యనగర అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కాలంలో విదేశాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ తేలగా.. మహిళను గచ్చిబౌలిలోని టిమ్స్ కు పంపించారు. జినోమ్‌ సీక్వెన్స్‌ కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. ఆమెకు ఒమిక్రాన్‌ అని నిర్థారణ అయితే నగరంలో కఠినమైన ఆంక్షలు విధించాలని సర్కార్ యోచిస్తోంది.
ఆంక్షలు మరింత...
కాగా ఇప్పటికే హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రోజువారి కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ప్రభుత్వ అధికారులు రాజధానిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. అలాగే కరోనా వ్యాక్సిన్లు వేయించుకోని వారు త్వరగా వేయించుకోవాలని సూచించారు.


Tags:    

Similar News