Pending challans : నేటి గడువు సమాప్తం.. ఈరోజు చెల్లించకుంటే ఇక అంతే

ట్రాఫిక్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ఈరోజు ఆఖరి గడువు అని అధికారులు పేర్కొన్నారు

Update: 2024-02-15 06:44 GMT

ట్రాఫిక్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ఈరోజు ఆఖరి గడువు అని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్ చలాన్లను చెల్లించాల్సిన గడువు నేటితో ముగియనుండటంతో వాహనదారులు ఇక ఆలస్యం చేయకుండా చెల్లించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాహనాల పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం భారీగా రాయితీ ఇచ్చింది.

భారీ రాయితీని ఇచ్చినా...
టూ వీలర్స్, త్రీవీలర్స్ పై ఎనభై శాతం, కార్లు ఇతర వాహనాలకు 60 శాతం, ఆర్టీసీ బస్సులపై 90 శాతం రాయితీని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ పెండింగ్ చలాన్ల ద్వారా నూట యాభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. పలుమార్లు రాయితీ చలాన్ల చెల్లింపును పొడిగిస్తూ వచ్చిన ప్రభుత్వం ఈసారి పొడిగిస్తుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఒక్క సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ స్పందన వచ్చింది. తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.


Tags:    

Similar News