Revanth Reddy : నేడు బాచుపల్లికి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. నేడు పలు శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు చేయనున్నారు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించనున్నారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించనున్నారు.
జైహింద్ ర్యాలీలో పాల్గొని...
మరోవైపు భారీ వర్షాలకు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, హైడ్రా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరనున్నారు. అలాగే నేడు హైదరాబాద్ లోని బాచుల్లిలో జైహింద్ ర్యాలీ జరుగుతుంది. భద్రతాదళాలకు సంఘీభావంగా ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.