Revanth Reddy : నేటి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-08-20 02:45 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం పదిన్నర గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రేవంత్ నివాళులర్పించనున్నారు.

రిజిస్ట్రార్ కార్యాలయాన్ని...
అనంతరం ఉదయం పదకొండు గంటలకు గచ్చిబౌలికి వెళతారు. అక్కడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సచివాయాలనికి చేరుకును పలువురు అధికారులు, మంత్రులతో సమావేశమవుతారు.


Tags:    

Similar News