Telangana : నేడు రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

తెలంగాణ రెండో విడత ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల అయింది

Update: 2025-11-30 05:05 GMT

తెలంగాణ రెండో విడత ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈరోజు నుంచి డిసెంబరు 2వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. మొదటి విడత గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలకు నామినేష గడువు ముగియడంతో నామినేషన్ల ఉప సంహరణ కు డిసెంబరు 3వ తేదీ వరకూ గడువు ఉంది. డిసెంబరు 11న మొదటి విడతగా 4,236 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

డిసెంబరు 14న పోలింగ్...
రెండో విడత నామినేషన్లను నేటి నుంచి అధికారులు స్వీకరించనున్నారు. నామినేషన్లను డిసెంబర్ 3వ తేదీన పరిశీలించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4,333 గ్రామాల్లో ఎన్నికలను నిర్వహించేందుకు అదికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News