Telangana : గుడ్ న్యూస్ గురుకులాల ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది.
తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఏడాది విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ప్రవేశం లభిస్తే ఉచిత వసతి, భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించనుండటంతో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది.
వీరికి మాత్రమే...
అయితే వీటిలో గిరిజన, ఆదివాసీ గిరిజన, సంచార గిరిజన, పాక్షిక గిరజిజన, డీ నోటిఫైడ్ ట్రైబల్ కుచెందిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆసక్తిగలిగిన వారు వచ్చే నెల 16వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రవేశ పరీక్ష లో ఉత్తీర్ణులయిన వారికే వీటిలో అవకాశం కల్పించనున్నారు. ఈ గురుకులాల్లో 690 బాలికలకు, 690 బాలురకు సీట్లు కేటాయిస్తారు. వార్షికాదాయం లక్షన్నరకు మించకూడదు. మార్చి 16న ప్రవేశపరీక్ష ఉంటుంది. మార్చి 31వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.