Telangana : నేడు నామినేషన్ల దాఖలకు చివరి గడువు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలి విడత సర్పంచ్, వార్డు ఎన్నికలకు నామినేషన్లు పూర్తయ్యాయి. రెండో విడతకు సంబంధించి నేడు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి.
రెండో విడతగా...
రెండో విడత స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించి 196 సర్పంచ్ ఎన్నికలకు 578 నామినేషన్లు, 1760 వార్డులకు 1,353 నామినేషన్లు దాఖలయినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉప సంహరణ కు డిసెంబరు 3వ తేదీ వరకూ గడువు ఉంది. డిసెంబరు 11న మొదటి విడతగా 4,236 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4,333 గ్రామాల్లో ఎన్నికలను నిర్వహించేందుకు అదికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.