లంకె బిందెల స్టోరీ చెప్పిన కేటీఆర్.. ఎవరి గురించి అంటే?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా వచ్చేవి కావని

Update: 2024-02-25 14:44 GMT

రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మోదీ వేవ్ లేదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీ గురించి మనం ఎందుకు ఆలోచించాలని ప్రశ్నించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా వచ్చేవి కావని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన మండిపడ్డారు.ఇక కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలే ఊహించలేదన్నారు. అందుకే ఎన్నికలకు ముందు అమలుకి సాధ్యంకాని హామీలు ఇచ్చారని చెప్పారు. అప్పుడేమో 200 యూనిట్ల కరెంటు అందరికీ అందిస్తామని చెప్పి.. ఇప్పుడేమో కొందరికే ఇస్తామనంటూ పథకాల అమలులో కొత్త కొర్రీలు పెడుతున్నారన్నారు కేటీఆర్. లంకె బిందెల కోసం దొంగలు అర్ధరాత్రుళ్లు తిరుగుతారనీ.. కానీ సచివాలయంలో రాజకీయ నాయకులు పట్టపగలే తిరుగుతున్నారని విమర్శించారు. లంకె బిందెలు వెతికే రేవంత్‌రెడ్డి పాతబుద్ధులు మరోసారి బయటకు వస్తున్నాయని చెప్పారు. రైతుబంధు కోసం ప్రస్తుతం ముఖాలు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలకు రూ.2500 ప్రతినెలా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


Tags:    

Similar News