Telangana :lనేడు ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఈరోజు ఉదయం వరకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Update: 2025-08-29 03:30 GMT

ఈరోజు ఉదయం వరకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.

ముఖ్యమంత్రి సమీక్ష...
భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, హన్మకొండ, వరంగల్‌, జనగామ, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ చెప్పింది.దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. భారీ వర్షాలు, వరదలపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదికను తెలంగాణ ప్రభుత్వం పంపనుంది


Tags:    

Similar News