Telangana : కొత్త మంత్రుల శాఖలు ఇవే

తెలంగాణలో కొత్త మంత్రుగా బాధ్యతలు చేపట్టిన వారికి శాఖలను కేటాయింపు జరిగింది.

Update: 2025-06-12 02:20 GMT

తెలంగాణలో కొత్త మంత్రుగా బాధ్యతలు చేపట్టిన వారికి శాఖలను కేటాయింపు జరిగింది. ఈ మేరకు నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీతో చర్చించిన తర్వాత కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ నెల 8వ తేదీన ముగ్గురు మంత్రులు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో శాఖల కేటాయింపు జరగలేదు.

ముగ్గురికి కేటాయిస్తూ...
నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త శాఖలను కేటాయింపులు జరుపుతూ నిర్ణయం తీసుకున్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక మరియు మైనింగ్ శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, స్పోర్ట్స్ అండ్ యువజన సర్వీసుల శాఖ కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News