నేడు నీట్ పరీక్ష ఒక్క నిమిషం ఆలస్యమయినా?

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష నీట్ నేడు జరగనుంది.

Update: 2024-05-05 05:17 GMT

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష నీట్ నేడు జరగనుంది. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకూ ఈ పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షలో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బేస్డ్ రియల్ టైం అనలెటికల్ టూల్ ను ఉపయోగిస్తున్నారు.

పరీక్ష కేంద్రాల్లోకి...
ఉదయం 11.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. దేశ వ్యాప్తంగా నేడు జరిగే నీట్ పరీక్ష కోసం 23 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి డెబ్బయి వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరారు. తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిర, వరంగల్ లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను పెన్ పేపర్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News