Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక తీర్పు

తెలగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది

Update: 2024-04-26 12:18 GMT

Phone Tapping Case:తెలగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ప్రీణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై విచారణచేసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువరించింది.

బెయిల్ నిరాకరిస్తూ...
ముగ్గురు నిందితులు బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. వారి బెయిల్ పిటీషన్లను కొట్టివేసింది. పోలీసులు మాత్రం ఈకేసులో ముగ్గురి నిందితులకు బెయిల్ ఇవ్వవద్దని కోరింది. అయితే ఇదే కేసులో ఏ 4 నిందితుడిగా ఉనన రాధాకిషన్ రావు కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల29వ తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News