చికోటి ప్రవీణ్ కు ముందస్తు బెయిల్

సెక్యూరిటీ వద్ద గన్స్ లభించడంతో వారిని అదుపులోకి తీసుకుని, లైసెన్స్ రెన్యూవల్ లేని వాటిని వాడుతున్నారని అరెస్ట్ చేసి..

Update: 2023-07-26 15:02 GMT

హైదరాబాద్ లో ఇటీవల జరిగిన లాల్ దర్వాజ బోనాల్లో.. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీతో వచ్చి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ లోకి ప్రైవేట్ సెక్యూరిటీతో, వెపన్స్ తో వచ్చిన చికోటి ప్రవీణ్ పై పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టు చికోటి ప్రవీణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. బోనాల ఉత్సవాల్లో ప్రైవేట్ గన్ మెన్స్ తో సింహవాహిని ఆలయానికి వెళ్లిన చికోటి ప్రవీణ్ ను పోలీసులు అడ్డుకున్నారు.

సెక్యూరిటీ వద్ద గన్స్ లభించడంతో వారిని అదుపులోకి తీసుకుని, లైసెన్స్ రెన్యూవల్ లేని వాటిని వాడుతున్నారని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ముగ్గురు గన్ మెన్స్.. రమేష్‌గౌడ్‌, సుందర్‌నాయక్‌, రాకేష్‌కుమార్‌లను అరెస్ట్ చేసి విచారించారు. తర్వాత ప్రవీణ్ ను ఏ1 ముద్దాయిగా మార్చారు పోలీసులు. ఈ క్రమంలో ప్రభుత్వం తనపై కక్ష పూరిత కుట్ర చేసి, కావాలనే కేసుపెట్టి ఏ1 ముద్దాయిగా మార్చిందంటూ చికోటి ప్రవీణ్.. నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్ పై బుధవారం (జులై 26) విచారణ జరిపిన కోర్టు ప్రవీణ్ కు ఊరటనిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆలయంలోకి అనుమతి లేకుండా గన్ లు క్యారీ చేసినందుకు జరిమానా విధించింది.


Tags:    

Similar News