నేటి నుంచి నాగోబా జాతర

గిరిజనుల అతి పెద్ద పండగ అయిన నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది

Update: 2025-01-28 04:32 GMT

గిరిజనుల అతి పెద్ద పండగ అయిన నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి నాగోబా జాతరకు సంబంధించి మహాపూజ చేయనున్నారు. తొలి పూజను మైస్రం వంశీయులు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. నేడు ప్రారంభమమయ్యే నాగోబా జాతర వచ్చే నెల నాలుగో తేదీ వరకూ జరగనుంది. గిరిజనులు అతి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ జాతరను జయప్రదం చేయనున్నారు.

గిరిజనులకు ఇష్టమైన...
తమ ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకోనున్నారు.ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో నాగోబా జాతర ప్రారంభం కానుంది. నాగోబా జాతరకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర కోసం ఆరు వందల మందిపోలీసులను నియమించింది. వంద సిసీ కెమెరాలతో పటిష్టమైన భద్రతను కల్పిస్తుంది. గిరిజనులు పెద్ద సంఖ్యలో వచ్చి జరుపుకునే జాతర కావడంతో దీనికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా వేలాది మంది తరలి రానున్నారు.


Tags:    

Similar News