కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి
కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది.
కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. రామారెడ్డి మండలంలోని స్కూల్ తండాలో పెద్దపులి సంచారాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించార. తండాలో ఒక రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
ఆవుపై దాడితో...
పెంపుడు జంతువులు ఆవులు, కుక్కలు వంటి వాటిని బయట కట్టేయవద్దని సూచించారు. దీనిని ఎస్ 12 పెద్దపులిగా అటవీ శాఖ అధికారులు పాదముద్రలను బట్టి గుర్తించారు. రామారెడ్డి మాచారెడ్డి మండలానికి సంబంధించిన అడవుల్లో అటవీ శాఖ సిబ్బంది వచ్చి ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రైతులు ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దంటూ అటవీ శాఖ అధికారులు గ్రామస్థులకు హెచ్చరికలు జారీ చేశారు.