నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం

నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమయింది. ఈరోజు శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు

Update: 2025-07-25 02:16 GMT

నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమయింది. ఈరోజు శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పూజిస్తే కుటుంబంలో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ప్రతి శ్రావణ శుక్రవారం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ శుక్రవారాలు నాలుగు మాత్రమే వచ్చేవి.

తొలి శుక్రవారం కావడంతో...
కానీ ఈ ఏడాది నేటి నుంచి జరిగే శ్రావణ మాసంలో మొత్తం ఐదు శుక్రవారాలు రానున్నాయి. ఉదయాన్నే తలారా స్నానం చేసి మహిళలు నూతన వస్త్రాలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారికి పండ్లు, ఫలహారాలు సమర్పించుకుంటారు. ప్రత్యేక నైవైద్యాలను సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించి తమ మొక్కులు తీర్చుకుంటారు.


Tags:    

Similar News