Telangana : తెలంగాణ శాసనసభలో రెండు కీలక బిల్లులు ఆమోదం

తెలంగాణలో స్థానిక సంస్థలు వచ్చే నెల 30వ తేదీలోపు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Update: 2025-08-31 07:57 GMT

తెలంగాణలో స్థానిక సంస్థలు వచ్చే నెల 30వ తేదీలోపు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళతామని ఆయన తెలిపారు. మరొకవైపు రేపు అసెంబ్లీలో చేసిన తీర్మానాలను ఆమోదించాలని గవర్నర్ ను కోరాలని నిర్ణయించింది. అన్ని పార్టీల నేతలను కలుపుకుని వెళతామని తెలిపారు.

మూడ్ ఆఫ్ ది హౌస్ మేరకు...
మూడ్ ఆఫ్ ది హౌస్ మేరకు తెలంగాణ గవర్నర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ ను కూడా ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎంలకు ఇప్పటికే చెప్పామని, బీఆర్ఎస్ నేతలు కూడా గవర్నర్ వద్దకు వచ్చి బీసీ రిజర్వేషన్లతో పాటు కీలకమైన బిల్లులు ఆమోదం పొందేందుకు వీలుగా రావాలని ఆయన కోరారు.


Tags:    

Similar News