ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు
స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలనిమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చార. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు.
వచ్త్చే మంత్రి వర్గ సమావేశంలో...
అయితే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విషయంలో వచ్చే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల తేదీపై మంత్రివర్గ సమావేశం తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ మేరకు కార్యకర్తల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. రిజర్వేషన్లు కూడా నిర్ణయించాలని అన్నారు.