Ponguleti : మీ నాయన వల్లే కాదు.. నీవల్ల ఏమవుతుంది?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-09-18 12:27 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "పాలేరులో తన గెలుపును ఆపడానికి మీ నాయన మూడు సార్లు ముక్కు నేలకు రాసినా..ఆయన వల్లే కాలేదు..నీ వల్ల అవుద్దా..బచ్చాగాడివి.. మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా..సంచి సర్దుకుని అమెరికాకు చెక్కుతవా..అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించడానికి సిద్దంగా ఉన్నారు" అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో చూసుకుందామా?
దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. తనపై అవాకులు, చవాకుల పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో బచ్చాగాడిని నిలబెట్టి నిన్ను ఓడించే సత్తా తనకుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇకనైనా నీ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ హితవు పలికారు.


Tags:    

Similar News