ఒవైసీ మాత్రం జై కొట్టలేదే

బోలో స్వతంత్ర భారత్ కీ అంటే జై అని నినాదాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేయలేదు.

Update: 2022-08-16 06:40 GMT

బోలో స్వతంత్ర భారత్ కీ అంటే జై అని నినాదాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేయలేదు. అబిడ్స్ లో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపనలో ఒవైసీ పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన పూర్తయిన తర్వాత నిర్వాహకులు బోలో స్వతంత్ర భారత్ కీ అనే నినాదం ఇచ్చారు. ఆ ప్రాంతమంతా ఆ నినాదంతో మారు మోగిపోయింది.

వీలు కుదరకనా?
బోలో స్వతంత్ర భారత్ కీ అని నిర్వాహకులు అనగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఒక చేయి పైకి ఎత్తి జై అని అన్నారు. అందరు నేతలు జై అన్నారు కానీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం జై కొట్టలేదు. స్వాతంత్ర్యం వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన చేశారు. ఆబిడ్స్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. కానీ భారత్ మాతాకీ జై అనే నినాదానికి ఒవైసీ నుంచి స్పందన లేకపోవడం పై సర్వత్రా చర్చ జరుగుతుంది. చుట్టు పక్కల నేతలు ఎక్కువగా ఉండటంతోనే ఆయన చేయి పైకి ఎత్తలేకపోయారేమోనని కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద అబిడ్స్ లో జరిగిన సామూహిక జాతీయ ఆలాపనలో ఒవైసీ జై కొట్టకపోవడం హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News