Rains In Telangana : తెలంగాణలో నేడు భారీ వర్షాలు పడే ప్రాంతాలివే
తెలంగాణలో అనేక జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
heavy rains in telangana today
తెలంగాణలో అనేక జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను దానా ప్రభావం ఇక్కడ కూడా చూపుతుందని, అయితే అంత తీవ్రత ఎక్కువగా ఉండదని, కొన్ని చోట్ల మోస్తరు గానూ, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.
ఉత్తరాది జిల్లాల్లో...
ప్రధానంగా తెలంగాణలోని ఉత్తరాది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతే కాదు కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని, గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా పడే అవకాశముందని పేర్కొంది.