Rain Alert : నాలుగు రోజులు హెవీ రెయిన్స్.. అలెర్ట్ గా ఉండాల్సిందే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణితో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఇంకొక చోట తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని తెలిపింది.
ఈ నెల 9వ తేదీ వరకూ...
తెలంగాణలో ఈ నెల 9వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పంది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో నేడు వర్షాలుపడతాయని తెలిపింది.
ఇక్కడ భారీ వర్షాలు...
ఇక అమరావతి వాతావరణ కేంద్రం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. కోస్తాంధ్రలోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని, ప్రయాణాలుపెట్టుకున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.