Rain Alert : మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. బలమైన గాలులు కూడా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-09-16 04:33 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. ఈదురుగాలులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

మరో మూడు రోజుల పాటు...
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిపింది. ఈరోజు నారాయణపేట, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. హైదరాబాద్ లోనూ కుండ పోత వర్షం పడే అవకాశముందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లోనూ మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు పడతాయని చెప్పింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. భారీ వర్షాలతో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని చెప్పింది.



Tags:    

Similar News