మృత్యువుతో పోరాడి ఓడిన మెడికో ప్రీతి.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిందితులు ఎవరైనా సరే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రీతి మరణం పట్ల మంత్రి హరీష్ రావు..

Update: 2023-02-27 01:53 GMT

doctor preeti passed away

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతి నిన్న (ఫిబ్రవరి 27) రాత్రి 9.10 గంటల సమయంలో మరణించినట్లు నిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి చెందారు. ఆమె కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది తెలంగాణ సర్కార్. అలాగే కుటుంబంలో ఒకరికి పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిందితులు ఎవరైనా సరే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రీతి మరణం పట్ల మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి చెందారు. మృత్యుంజయురాలుగా తిరిగి వస్తుందనుకున్న ప్రీతి.. మరణించడం బాధాకరమన్నారు. ప్రీతి మరణం తన మనసుని తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. వైద్యులు ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించగా.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రీతిని వేధించిన సైఫ్ ను వెంటనే ఉరి తీయాలని, అతని వెనుక ఉన్న వాళ్లని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News