ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో కూడా రావచ్చు

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వస్తుండటంతో తెలంగాణలో కూడా వచ్చే అవకాశముందని తెలంగాణ వైద్య శాఖ తెలిపింది

Update: 2021-12-05 08:49 GMT

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వస్తుండటంతో తెలంగాణలో కూడా వచ్చే అవకాశముందని తెలంగాణ వైద్య శాఖ తెలిపింది. ఇప్పటికే కర్ణాటక, గుజరాత్, మహరాష్ట్ర, ఢిల్లీలో ఈ కేసులు వెలుగు చూశాయని వైద్య శాఖ అధికారులు చెప్పారు. అయితే ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్య శాఖ తెలిపింది. రేపో, మాపో తెలంగాణలో కూడా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది.

అప్రమత్తంగా ఉండాల్సిందే...
అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని మెయిన్ టెయిన్ చేయడం, తరచూ శానిటైజర్ తో చేతులు శుభ్రపర్చుకోవడం వంటివి చేయాలని కోరింది. విదేశాల నుంచి వచ్చిన 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారి రక్తనమూనాలను జినోమ్ సీక్వెన్స్ కు పంపామని, ఫలితాలు సాయంత్రం వచ్చే అవకాశముందని అధికారులు చెప్పారు.


Tags:    

Similar News