మేడారం హుండీ లెక్కింపు పూర్తీ.. ఎంత వచ్చిందంటే?

కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య మేడారం హుండీల లెక్కింపు పూర్తయింది

Update: 2024-03-07 01:22 GMT

కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య మేడారం హుండీల లెక్కింపు పూర్తయింది. హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్యాణ మండపంలో హుండీల లెక్కింపును పూర్తీ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర ముగియడంతో మేడారం నుంచి హన్మకొండకు మొత్తం 518 హుండీలను తరలించారు. ఈ లెక్కింపు ప్రక్రియలో దేవాదాయ శాఖ సిబ్బంది, వాలంటీర్లతో కూడిన సుమారు 450 మంది పాల్గొన్నారు. ఆభరణాలను మేడారంలోని బ్యాంక్ లాకర్‌లో భద్రపరుస్తామని, విదేశీ కరెన్సీని కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తామని అధికారులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో అధికారులు పలు నకిలీ 100 రూపాయల నోట్లను గుర్తించారు. హుండీల్లో బెల్లం, పసుపు పడిపోవడంతో పలు కరెన్సీ నోట్లు అంటుకుని మురికిగా ఉన్నట్లు గుర్తించారు.

540 హుండీలను వారం రోజుల పాటు లెక్కించారు. హుండీల ద్వారా రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2022 మేడారం జాతర కంటే ఈ ఏడాది జాతరకు రూ.1.79 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరిగింది. జాతర అనంతరం హుండీలను హన్మకొండ లోని టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నోట్లు, కాయిన్స్ కలిపి మొత్తం 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయలు వచ్చాయి. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి వచ్చింది.


Tags:    

Similar News