Telangana: ఊపందుకున్న "మార్వాడీ గో బ్యాక్" నినాదం

మార్వాడీల గో బ్యాక్ నినాదం తెలంగాణలో ఊపందుకుంది. నేడు తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపు నిచ్చింది

Update: 2025-08-22 02:31 GMT

మార్వాడీల గో బ్యాక్ నినాదం తెలంగాణలో ఊపందుకుంది. నేడు తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపు నిచ్చింది. గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం చాపకింద నీరులా తెలంగాణ అంతటా విస్తరిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి మార్వాడీ గో బ్యాక్ నినాదం అనేక ప్రాంతాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా, టీవీ మాధ్యమాల ద్వారా దానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఆమనగల్లులో ప్రారంభమయిన మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం మరింత ఊపందుకుంటున్నట్లే కనిపిస్తుంది. మార్వాడీలు స్థానికులకు ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు తెలంగాణ వ్యాపారులకు అడ్డంకిగా మారారన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు.

తాము సమాజంలో భాగమేనని...
మరొకవైపు మార్వాడీలు కూడా తాము కూడా తెలంగాణ సమాజంలో భాగమేనని, తెలంగాణ ఉద్యమంలో కూడా తాము పాల్గొన్నామని వారు చెబుతున్నారు. మార్వాడీలలో కూడా బీసీలు, ఎస్.సిలు ఉన్నారని, అందరూ సంపన్నులు కారని వారు వాదిస్తున్నారు. తాము అందరికీ అందుబాటులో ఉంటూ తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తున్నామని చెబుతున్నారు. అయితే చిన్న చిన్న వ్యాపారులను, బడా వ్యాపారులను ఒకే గాటన కట్టేస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక సంఘటనతో మార్వాడీ సమాజాన్నిమొత్తం గో బ్యాక్ అనడం ఎంత వరకూ సబబని వారు ప్రశ్నిస్తున్నారు. తాము తెలంగాణ సమాజంలో భాగమేనని చెబుతున్నారు. తాము నిజాం కాలం నాటి నుంచి వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.
రాజకీయ పార్టీల జోక్యంతో...
మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం వెనక రాజకీయ పార్టీల ప్రమేయం కూడా ఉండటంతో మరింతగా వేడెక్కింది. బీజేపీ కూడా దీనిపై రంగంలోకి దిగి మార్వాడీలను గో బ్యాక్ అనే వారు ముందు రోహింగ్యాలను వెనక్కు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్లవల్ల తెలంగాణ ఆదాయం పెరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి నేతలు కూడా వాదిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గానే ఉంది. సోషల్ మీడియాలో ఉద్యమం ఊపందుకోవడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై ఇంటలిజెన్స్ కూడా ఫోకస్ పెట్టింది. మార్వాడీల దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపు నివ్వడంతో టెన్షన్ గా మారింది.


Tags:    

Similar News