భార్యపై అనుమానం.. భరించలేక కొడుకుతో కలిసి ఆత్మహత్య !

వృత్తిరీత్యా స్వామి వ్యవసాయ పనులతో పాటు.. కూలీ పనులు చేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతుండగా.. స్వామికి నవిత ప్రవర్తనపై అనుమానంవచ్చింది. నవితకు

Update: 2021-12-26 10:22 GMT

భార్య ప్రవర్తనపై భర్తకి అనుమానం వచ్చింది. తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలోనే భార్యపై భర్త చేయి చేసుకోవడంతో.. భరించలేని భార్య తన రెండేళ్ల కుమారుడికి నిప్పంటించి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం సిర్సనగండ్ల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సిర్సనగండ్ల కు చెందిన స్వామికి.. చేర్యాల మండలం వేచరేణికి చెందిన పోశయ్య - మల్లవ్వల చిన్న కుమార్తె నవితతో 10 ఏళ్ల క్రితం వివాహమయింది. వీరికి మణిదీప్ (2) అనే కుమారుడు ఉన్నాడు.

వృత్తిరీత్యా స్వామి వ్యవసాయ పనులతో పాటు.. కూలీ పనులు చేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతుండగా.. స్వామికి నవిత ప్రవర్తనపై అనుమానంవచ్చింది. నవితకు ఆమె అన్నతో వివాహేతర సంబంధం ఉందంటూ వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయంపై భార్య - భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వారంరోజుల క్రితం ఈ విషయం కులపెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. పెద్ద ఇద్దరికీ నచ్చజెప్పి పంపించారు. శనివారం ఉదయం చేనులో పత్తి ఏరేందుకు భార్యను రమ్మని పిలిచాడు స్వామి. కానీ.. ససేమిరా చేనుకు రానని చెప్పడంతో మళ్లీ గొడవ మొదలైంది. ఈ క్రమంలో స్వామి తన భార్యపై చేయి చేసుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లిపోయాడు.
భర్త తనపై చేయి చేసుకోవడంతో మనస్తాపం చెందిన నవిత.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తమ రెండేళ్ల కుమారుడు మణిదీప్ పై పెట్రోల్ పోసి నిప్పటించి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు తలుపులు పగలగొట్టి చూడగా.. తల్లీ- కొడుకు విగతజీవులుగా పడి ఉన్నారు. తమ కూతురు నవితపై లేనిపోని అభాండాలు వేసి, వేధించి చంపారంటూ నవిత తల్లిదండ్రులు ఆరోపించారు. అత్త బీరవ్వ, బావ భాస్కర్, భర్త స్వామిలే తమ కూతురి మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News