Malla Reddy : నేను భూ కబ్జాలకు పాల్పడలేదు
తనపై నమోదయిన కేసుల గురించి మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను ఎటువంటి భూ కబ్జాలకు పాల్పడలేదని తెలిపారు
malla reddy land grabbing
తనపై నమోదయిన కేసుల గురించి మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను ఎటువంటి భూ కబ్జాలకు పాల్పడలేదని మల్లారెడ్డి తెలిపారు. తనపై అనవసరంగా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తన పేరు మీద ఎలాంటి భూ లావాదేవీలు జరగలేదని మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు.
న్యాయపరంగానే....
అయినా తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదుచేయడం దురదృష్టకరమని అన్నారు. తాను 47 ఎకరాల గిరిజనలు భూమిని ఆక్రమించుకున్నానన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తనపై నమోదయిన ఎఫ్ఐఆర్ పై తాను హైకోర్టు ను ఆశ్రయిస్తానని మల్లారెడ్డి తెలిపారు. న్యాయపరంగానే కేసులను ఎదుర్కొంటానని ఆయన చెప్పారు.