నేటి నుంచి యాదాద్రిలో భక్తులకు అనుమతి
యాదాద్రిలో నేడు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఆరేళ్ల తర్వాత భక్తులను ప్రధాన ఆలయంలోకి అనుమతించనున్నారు.
యాదాద్రిలో నేడు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. దీంతో నేడు ఆరేళ్ల తర్వాత భక్తులను ప్రధాన ఆలయంలోకి అనుమతించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా పాల్గొననున్నారు. మహాకుంభ సంప్రోక్షణ పూర్తయిన వెంటనే భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడుని దర్శించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఆరేళ్ల నుంచి భక్తులు వేచి చూస్తున్న సమయం వచ్చేసింది.
పోలీసు బందోబస్తు....
ఈరోజు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు అరవై వేల మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా యాదాద్రికి రానుండటంతో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.