కేంద్రాన్ని ఇరుకున పెట్టిన కేటీఆర్

కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.

Update: 2021-12-04 02:13 GMT

ప్రస్తుత ప్రభుత్వం బీజేపీ లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతున్నట్లు కన్పిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో వరిధాన్యం సేకరణపై పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా ట్వీట్ చేశారు. తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానమంత్రిని కేటీఆర్ కోరారు.

జాతీయ హోదా కావాలంటూ...
తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్ కోరారు. ఆంధప్రదేశ్ కు పోలవరం, కర్ణాటకు అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ప్రాజెక్టులను మాత్రం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఎన్ని సార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News