KTR : ఐఏఎస్ లకు కేటీఆర్ వార్నింగ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు

Update: 2025-10-23 07:57 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. మంత్రులు చేసే తప్పులకు అధికారులు బలి కావద్దని కేటీఆర్ అన్నారు. ఐఏఎస్ అధికారులకు ఇది తన విజ్ఞప్తి అని తెలిపారు. ఈరోజు ఐఏఎస్ అధికారి రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చిందని, ఇలా ఎందుకు జరిగిందో ఆలోచించాలని కేటీఆర్ కోరారు. తాను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానని, మీరు రేవంత్ రెడ్డి లేదా ఇంకో మంత్రి చేసే అరాచకాలకు వత్తాసు పలికితే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు.

మూటల కొట్లాటలో...
ముఖ్యమంత్రి, మంత్రులు చేసే అరాచకాల్లో తాము ఉండమని చెప్పి అధికారులు భయపడుతున్నారన్న కేటీఆర్ అందుకే వత్తిడి తట్టుకోలేక స్వచ్ఛంద పదవీ విరమణ చేయడానికి సిద్ధమవుతున్నారని కేటీఆర్ అన్నారు. ఈ మూటల కొట్లాటల్లో తాము ఎందుకు తల దూర్చాలని అధికారులు పారిపోతున్నారని అంటేనే అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.


Tags:    

Similar News