నేడు గాంధీభవన్ కు కొండా మురళి

నేడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుటకు కొండా మురళి హాజరు కానున్నారు.

Update: 2025-06-28 02:42 GMT

నేడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుటకు కొండా మురళి హాజరు కానున్నారు. గాంధీభన్ లో జరగనున్న ఈ సమావేశంలో కొండా మురళి తన వివరణను అందించనున్నారు. కొండా మురళి సీనియర్ పార్టీ నేతలపై చేసిన విమర్శలను కొందరు వరంగల్ జిల్లా నేతలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.

క్రమశిక్షణ సంఘం ఎదుటకు...
దీంతో కొండా మురళిని నేడు విచారణకు రావాలని క్రమశిక్షణ కమిటీ పిలిచింది. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి లపై చేసిన వ్యాఖ్యలపై కొండా మురళి నుంచి వివరణ తీసుకోనుంది. అనంతరం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు కొండా మురళి వివరణ తీసుకుని చర్యలు తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News