Breaking : ఫార్ములా ఈ కారు రేసు కేసుపై ప్రభుత్వానికి నివేదిక

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక సమర్పించారు.

Update: 2025-09-09 11:47 GMT

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ రేపుతుంది. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి ఏసీబీ సుదీర్ఘకాలం విచారించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రెండు సార్లు విచారణ చేసింది. ఈ కేసులో విషయాలను గురించి ఆరా తీసింది. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండటంతో రేపు ఆయన వచ్చిన తర్వాత దీనిపై మంత్రివర్గ సభ్యులతో కూర్చుని మాట్లాడతారని తెలిసింది. దాదాపు తొమ్మిది నెలల పాటు విచారించిన ఏసీబీ అధికారులు దీనిపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

కేబినెట్ లో చర్చించి...
ఫార్ములా ఈ కారు రేసు కేసును ఈడీ కూడా విచారించింది. ఏసీబీ విచారణ చేసిన నివేదికను ప్రభుత్వానికి అందించడంతో ఈ కేసులో ఎవరెవరిని తప్పుపట్టింది? అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో్ పాటు మాజీ హెచ్ఎండీఏ మాజీ అధికారిని కూడా విచారించింది. మనీలాండరింగ్ కు పాల్పడ్డారని, దీంతో పాటు మంత్రివర్గం ఆమోదం లేకుండా హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించదన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు విచారణ జరిపి నివేదికను ప్రభుత్వం సమర్పించింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News