రేపు యాదాద్రికి కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రి వెళ్లనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు ముందు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు
kcr will go to yadadri tomorrow
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు ముందు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. దసరా రోజున ఆయన టీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీ గురించి తీర్మానం చేయనున్నారు.
జాతీయ పార్టీని ప్రకటించే ముందు....
జాతీయ పార్టీని ప్రకటించే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని దర్శించనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పొంది జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా జాతీయ పార్టీని పెట్టాలన్న తన ప్రయత్నం సఫలం కావాలని ఆయన స్వామి వారిని కోరనున్నారు.