మల్లన్నను ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయాలి
తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమెలిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాల నుంచి ఉపయోగించి ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. తెలంగాణ మహిళలను కించపర్చేలా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలున్నాయని, మహిళల మనోభావాలను కించపర్చేవిధంగా ఉన్నాయన్నారు.
మహిళలను కించపరుస్తూ...
రాష్ట్రంలో మహిళలు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారని, ప్రజాసమస్యలపై మాట్లాడుతున్నారని అలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నతమలాంటి వారినే ఇలా కించపరుస్తూ మాట్లాడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రావాలనుకున్నవాళ్లు కూడా వెనక్కుతగ్గుతారని అంటున్నారని అన్నారు. తాను ఏడాది నుంచి బీసీ రిజర్వేషన్లపై పోరాడుతున్నానని, ఏరోజూ తీన్మార్ మల్లన్నను ఒక్కమాట కూడా అనలేదని, తనను ఆయన అలా ఎందుకు అన్నారో తెలియదని కవిత మీడియాతో అన్నారు.