సీబీఐ చేతుల్లోకి కాళేశ్వరం విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును సీబీఐకు అప్పగించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును సీబీఐకు అప్పగించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పై తెలంగాణ అసెంబ్లీలో సుమారు 9 గంటలపాలు సుదీర్ఘంగా చర్చ సాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తన నివేదికలో తేల్చి చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం, మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్‌ఏ గుర్తించింది. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఉండడం వల్ల సీబీఐ దర్యాప్తునకు తమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు.