అవసరమైతే కేసీఆర్ ను కూడా పిలిచి సమాచారం తీసుకుంటాం

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కేసీఆర్ చారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు

Update: 2024-04-26 07:24 GMT

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్ ను పిలిచి సమాచారం తీసుకుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీస్కుంటామని అన్నారు.

ప్రభుత్వానికి నివేదిక....
బీఆర్‌కే భవన్లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ లో న్యాయ విచారణను జస్టిస్ ఘోష్ ప్రారంభించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంతో రాష్ట్రప ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ను నియమించారు. ఆయన రెండు రోజుల నుంచి దీనిపై విచారణ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో జరిగిన అవకతవకలకు కారణాలను కూడా ఆయన తన నివేదికలో తెలపనున్నారు.


Tags:    

Similar News