Jublee Hill Bye Elections : ఇప్పటి వరకూ కోటి నగదు పట్టివేత
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీలను ఎన్నికల అధికారులు ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి నేటి వరకూ నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న కోటి రూపాయలకు పైగా నగదు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈరోజు పది లక్షలు...
ఈ రోజు తనిఖీలలో భాగంగా టోలి చౌకీ వద్ద 10 లక్షల రూపాయల నగదు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం స్వాధీనం చేసుకుంది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో నేడు నామినేషన్ ల స్వీకరణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రధాన పార్టీల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేశారు. రేపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు.