కాంగ్రెస్ లో చేరమన్నారు.. నేను చేరనని చెప్పా
తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కొందరు కోరారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు
palla rajeshwar reddy
తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కొందరు కోరారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అయితే తాను చేరబోనని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పినట్లు ఆయన మీడియాకు తెలిపారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎప్పుడూ కామెంట్స్ చేయలేదని, తాను అనని మాటలను అన్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు.
తాను మాట్లాడకపోయినా...
తాను కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏ అంశంపైనా మాట్లాడలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తనపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. తాము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడతామని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.