Telangana : బీర్లను గటగటా తాగేస్తున్నారే.. ఒక్క నెలలోనే ఇన్ని బీర్ల అమ్మకాలా?

తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో బీరు కేసులు అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు.

Update: 2024-05-09 04:21 GMT

తెలంగాణలో ఎండల తీవ్రత గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మే నెల ఆరంభంలోనే ఈ పరిస్థితి ఉంది. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఈ ఎండల దెబ్బకు మందుబాబులు బీర్లను గటగటా తాగేస్తున్నారట. ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో బీరు కేసులు అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు. మరొకవైపు ఎన్నికలు కూడా జరుగుతుండటంతో బీర్లకు మంచి గిరాకి పెరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

ఈ నెలలో మరింతగా...
ఏప్రిల్, మే నెలలో గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా బీర్ల విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు లెక్కలతో సహా చెబుతున్నారు. దాదాపు ఏడు లక్ష కాటన్ల బీర్ల విక్రయాల వరకూ ఒక్క ఏప్రిల్ నెలలోనే జరిగినట్లు చెబుతున్నారు. కూలింగ్ బీరు కావాలంటే ఒకరేటు.. కూలింగ్ లేకపోతే మరొక రేటును వైన్ షాపుల యజమానులు వసూలు చేస్తున్నారు. రేట్లు ఎంత పెంచినా బీర్లను మాత్రం మనోళ్లు కడుపు నిండా తాగేస్తున్నారు. మే నెలలో బీర్ల విక్రయాలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News