Telangana : తెలంగాణలో జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు

తెలంగాణలో జూన్ ఒకటో తేదని ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభం కానున్నాయి

Update: 2026-03-31 12:05 GMT

తెలంగాణలో జూన్ ఒకటో తేదని ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫస్టియర్, సెకండియర్ క్లాసులు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

సెలవులివీ...
ఈ విద్యా సంవత్సరంలో 304 రోజులు ఉండగా, సెలవులు పోను 224 పనిదినాలు ఉంటాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆఫ్ ఇయర్లీ పరీక్షలు, జనవరి 18 నుంచి 23 వరకు ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి దసరాకు 12 రోజులు, సంక్రాంతికి 5 రోజులు సెలవులు ప్రకటించారు.


Tags:    

Similar News