Telangana : టార్గెట్ పొంగులేటి.. బీఆర్ఎస్ లక్ష్యమదేనా?

బీఆర్ఎస్ టార్గెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యారు

Update: 2026-03-30 12:42 GMT

బీఆర్ఎస్ టార్గెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యారు. బీఆర్ఎస్ నేతలు మంత్రి పొంగులేటిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్న దానిపై రాజకీయంగా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి మంత్రి పొంగులేటిని లక్ష్యంగా చేసుకోవడానికి బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా మారడంతో పాటు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని వ్యవహారాలకు సంబంధించి ఆధారాలను పొంగులేటి ముఖ్యమంత్రికి అందిస్తున్నారన్న అనుమానం కూడా వారిలో ఉందని చెబుతున్నారు.

బడ్జెట్ సమావేశాల్లో...
అందుకే ఈ బడ్జెట్ సమావేశాల్లో మిగిలిన మంత్రులను పక్కన పెట్టి ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఉభయ సభలను స్థంభింప చేయడమే కాకుండా గవర్నర్ కు ఆయనపై ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడికి చెందిన సంస్థ చేస్తున్న అక్రమాలను ఇందులో ప్రస్తావించారు. అంతేకాకుండా ఎన్నికలు మంత్రి పొంగులేటి కాంగ్రెస్ కు అవసరమైన నిధులను సమకూర్చడంలో మంత్రి పొంగులేటి ప్రధానమని అనుమానిస్తున్న గులాబీ పార్టీ నేతలు అందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారన్న టాక్ బలంగా వినపడుతుంది.
బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో..
పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో ఉన్న లోపాలను బయటకు తీస్తున్నారని కొందరంటుంటే.. పొంగులేటి అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తే కొంత తగ్గుతారని అంచనా వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేవలం అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా వట్టి నాగులపల్లిలో భూ కబ్జాల నుంచి అక్రమ మైనింగ్ ల వరకూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వివరిస్తామని కేటీఆర్ చెప్పడం మంత్రి పొంగులేటిని కంట్రోల్ చేస్తే తప్ప ప్రభుత్వం తమ విషయంలో దూకుడు తగ్గిస్తుందన్నభావన కూడా ఉండవచ్చని అన్నారు. అందుకే కారు పార్టీ నేతలు మంత్రి పొంగులేటి ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఇది టార్గెట్ కాదని, మంత్రి తో పాటు ఆయన కుమారుడు చేసే పనులను తాము బయట ప్రపంచానికి చెబుతున్నామని అంటున్నారు.





Tags:    

Similar News