Telangana: హిస్టరీ బ్రేక్.. మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు
తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒకరోజు పాటు మండలి సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు శాసనమండలిలో నినాదాలు చేస్తున్నారు.
మార్షల్స్ కు, సభ్యులకు మధ్య...
సభ ప్రారంభమయిన దగ్గర నుంచి నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకు వెళ్లడంతో వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ కు బీఆర్ఎస్ కు మధ్య తోపులాట జరిగింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులను మండలి సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి శాసనమండలి నుంచి సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.