తెలంగాణలో భారీ వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు మొదలయ్యాయి

Update: 2026-03-31 05:53 GMT

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు మొదలయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షపు ప్రభావం క్రమంగా ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ వైపు విస్తరిస్తోంది.

ఈ ప్రాంతాల్లో...
హైదరాబాద్,మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా వాతావరణం మారిపోయంది. ఈదురుగాలులతో కూడిన వానలు పడే పరిస్థితి ఏర్పడింది. ఇక నల్గొండ ప్రాంతంలో కూడా వచ్చే రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


Tags:    

Similar News