Telangana : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ లో ఇంటర్ పరీక్షలకు సంబంధించి హాల్ టిక్కెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు పంపనుంది. వారి వాట్సాప్ నెంబర్లకు ఇంటర్ హాల్ టిక్కెట్లు పంపించనుంది. ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
రెండు నెలల ముందే...
నలభై ఐదు రోజుల ముందే హాల్ టిక్కెట్లను వాట్సాప్ ద్వారా పంపనుంది. దీనివల్ల హాల్ టిక్కెట్లలో తప్పులు ఏమైనా ఉంటే సవరించుకోవడానికి తగిన సమయం ఉంటుందని తెలిపింది. తప్పులుంటే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ కు సమాచారం ఇవ్వాలని ఇంటర్ బోర్డు ప్రకటనలో తెలిపింది. ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుంది, విద్యార్థులు హాజరయ్యే పరీక్ష కేంద్రాన్ని కూడా హాల్ టిక్కెట్ లో పొందుపర్చనున్నారు.